calender_icon.png 13 February, 2026 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో వార్ వన్ సైడే...

13-02-2026 05:50:55 PM

హస్తగతమైన మంచిర్యాల కార్పొరేషన్ 

మంచిర్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్ట మొదటి ఎన్నికల ఫలితాలు శుక్ర వారం విడుదల అయ్యాయి. హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో 60 డివిజన్ ల ఎన్నికల కౌంటింగ్ కోసం 60 టేబుల్స్ ఏర్పాటు చేసి కట్టలు కట్టి రౌండ్ కి వెయ్యి ఓట్ల చొప్పున అదనపు సిబ్బందితో కలిపి 66 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 132 మంది కౌంటింగ్ సహాయకులు లెక్కించారు. అలాగే 60 డివిజన్లకు 240 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 59 మంది, బీఆర్ఎస్ నుంచి 58, బీజేపీ నుంచి 58, ఆప్ నుంచి 8 మంది, బీఎస్పీ నుంచి ఏడుగురు, ఏఐఎంఎం నుంచి రెండు, సీపీఎం నుంచి రెండు, ఏఐఎఫ్బీ నుంచి 18, సీపీఐ నుంచి ఒకరు, జనసేన నుంచి నలుగురు, ఇతర  గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగురు, ఇండిపెండెంట్లు 18 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొని వారి అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద మొత్తంలో విజయం సాధించారు.

గెలుపొందిన కార్పొరేటర్లు వీరే...

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొదటి డివిజన్ కార్పొరేటర్ గా  శ్రీపతి కవిత వాసు (కాంగ్రెస్), రెండవ డివిజన్ కార్పొరేటర్ గా పుట్ట యశోద (కాంగ్రెస్), మూడవ డివిజన్ కార్పొరేటర్ గా పత్తి ప్రకృతి వెంకటేష్ (కాంగ్రెస్), నాలుగవ డివిజన్ కార్పొరేటర్ గా గుమ్మడి శ్రీనివాస్ (బీఆర్ఎస్), ఐదవ డివిజన్ కార్పొరేటర్ గా తోటపల్లి రాజేశ్వరి (బీజేపీ), ఆరవ డివిజన్ కార్పొరేటర్ గా వనపర్తి కేత (బీజేపీ), ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా వేల్పుల రవీందర్ (కాంగ్రెస్), ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గా మేకల రమేష్ (ఏఐఎఫ్బీ), తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా సుర్మిళ్ల సౌమ్య వేణు (కాంగ్రెస్), పదవ డివిజన్ కార్పొరేటర్ గా రాచకొండ గోపాల్ రావు (కాంగ్రెస్), 11వ డివిజన్ కార్పొరేటర్ గా సుధమల్ల హరికృష్ణ (కాంగ్రెస్), 12వ డివిజన్ కార్పొరేటర్ గా కస్తూరి నాగరాజు (బీజేపీ), 13వ డివిజన్ కార్పొరేటర్ గా వారణాసి సమ్మయ్య (బీఆర్ఎస్), 14వ డివిజన్ కార్పొరేటర్ గా తూముల నరేష్ (కాంగ్రెస్), 15వ డివిజన్ కార్పొరేటర్ గా చింతపండు శ్రీనివాస్ (కాంగ్రెస్), 16వ డివిజన్ కార్పొరేటర్ గా బియ్యాల త్రివేణి (కాంగ్రెస్), 17వ డివిజన్ కార్పొరేటర్ గా లగిశెట్టి రాజన్న (కాంగ్రెస్),18వ డివిజన్ కార్పొరేటర్ గా రాసమల్ల కమల శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్).

19వ డివిజన్ కార్పొరేటర్ గా కాకుల వరలక్ష్మీ (కాంగ్రెస్), 20వ డివిజన్ కార్పొరేటర్ గా గంగవరపు వెంకటేశ్వర్లు (కాంగ్రెస్), 21వ డివిజన్ కార్పొరేటర్ గా జోగుల సదానందం (కాంగ్రెస్), 22వ డివిజన్ కార్పొరేటర్ గా కంకణాల రోజ (కాంగ్రెస్), 23వ డివిజన్ కార్పొరేటర్ గా కర్రు శంకర్ (బీఆర్ఎస్), 24వ డివిజన్ కార్పొరేటర్ గా బొడ్డు స్వప్న (కాంగ్రెస్), 25వ డివిజన్ కార్పొరేటర్ గా తోట రజిత శ్రీనివాస్ (కాంగ్రెస్), 26వ డివిజన్ కార్పొరేటర్ గా ఐరెడ్ల రవి (ఏఐఎఫ్బీ), 27వ డివిజన్ కార్పొరేటర్ గా కోండ్ర రాజేశ్వరి లింగయ్య (కాంగ్రెస్), 28వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత రాజ్ కుమార్ (బీఆర్ఎస్), 29వ డివిజన్ కార్పొరేటర్ గా బండారి సుధాకర్ (కాంగ్రెస్), 30వ డివిజన్ కార్పొరేటర్ గా కర్రె శ్రీనివాస్ (కాంగ్రెస్), 31వ డివిజన్ కార్పొరేటర్ గా తాళ్ల సంపత్ రెడ్డి (కాంగ్రెస్), 32వ డివిజన్ కార్పొరేటర్ గా ధర్ని మధూకర్ (కాంగ్రెస్), 33వ డివిజన్ కార్పొరేటర్ గా అంబడి కుమార స్వామి (కాంగ్రెస్), 34వ డివిజన్ కార్పొరేటర్ గా అగ్గు సాగర్ (జనసేన), 35వ డివిజన్ కార్పొరేటర్ గా మర్రి శ్రీలత (కాంగ్రెస్), 36వ డివిజన్ కార్పొరేటర్ గా అగల్ డ్యూటీ రాణి (కాంగ్రెస్), 37వ డివిజన్ కార్పొరేటర్ గా ఎండీ ఖాళీద్ (కాంగ్రెస్), 38వ డివిజన్ కార్పొరేటర్ గా పూదరి విజయరాణి తిరుపతి (కాంగ్రెస్), 39వ డివిజన్ కార్పొరేటర్ గా పూదరి సునీత ప్రభాకర్ (కాంగ్రెస్), 40వ డివిజన్ కార్పొరేటర్ గా ఆది శశికళ (కాంగ్రెస్), 41వ డివిజన్ కార్పొరేటర్ గా షేరు శ్రీలక్ష్మి (కాంగ్రెస్), 42వ డివిజన్ కార్పొరేటర్ గా చిందం సత్యవతి (కాంగ్రెస్), 43వ డివిజన్ కార్పొరేటర్ గా చిలువేరి జ్యోతి (కాంగ్రెస్), 44వ డివిజన్ కార్పొరేటర్ గా కోమాకుల కిషన్ (కాంగ్రెస్), 45వ డివిజన్ కార్పొరేటర్ గా దోమల సునీత లక్ష్మణ్ (బీఆర్ఎస్).

46వ డివిజన్ కార్పొరేటర్ గా పెంట రజిత (కాంగ్రెస్), 47వ డివిజన్ కార్పొరేటర్ గా వెంకట సాయి కృష్ణ (బీఆర్ఎస్), 48వ డివిజన్ కార్పొరేటర్ గా వేములపల్లి లక్ష్మీ దుర్గా (కాంగ్రెస్), 49వ డివిజన్ కార్పొరేటర్ గా అబ్దుల్ సత్తార్ (బీఆర్ఎస్), 50వ డివిజన్ కార్పొరేటర్ గా పెట్టం స్వరూప లక్ష్మణ్ (బీఆర్ఎస్), 51వ డివిజన్ కార్పొరేటర్ గా నీలి స్వప్న శ్రీనివాస్ (కాంగ్రెస్), 52వ డివిజన్ కార్పొరేటర్ గా వీరమనేని స్రవంతి (కాంగ్రెస్), 53వ డివిజన్ కార్పొరేటర్ గా నూర్జా భేగం (కాంగ్రెస్), 54వ డివిజన్ కార్పొరేటర్ గా సల్ల రమ్య (కాంగ్రెస్), 55వ డివిజన్ కార్పొరేటర్ గా గాండ్ల సత్తమ్మ (కాంగ్రెస్), 56వ డివిజన్ కార్పొరేటర్ గా నల్ల శంకర్ (కాంగ్రెస్), 57వ డివిజన్ కార్పొరేటర్ గా గాజుల ముఖేష్ గౌడ్ (బీజేపీ), 58వ డివిజన్ కార్పొరేటర్ గా బోట్ల అనిత (బీజేపీ), 59వ డివిజన్ కార్పొరేటర్ గా మాదంశెట్టి సత్యనారాయణ (కాంగ్రెస్), 60వ డివిజన్ కార్పొరేటర్ గా అఫ్రీన్ సుల్తానా (కాంగ్రెస్)లు ఘన విజయం సాధించారు. 60 డివిజన్లలో కాంగ్రెస్ నుంచి 59 మందికి 44 మంది కార్పొరేటర్లుగా గెలుపొందగా, బీఆర్ఎస్ నుంచి 58 మందికి ఎనిమిది, బీజేపీ నుంచి 58 మందికి ఐదుగురు, ఏఐఎఫ్బీ నుంచి 18 మందికి రెండు, జనసేన నుంచి నలుగురికి ఒకరు విజయం సాధించారు. ఆప్, బీఎస్పీ, ఏఐఎంఎం, సీపీఎం, సీపీఐ, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి కానీ ఇండిపెండెంట్లు సైతం ఒక్క సీటు సాధించలేకపోయారు.