calender_icon.png 13 February, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం, గులాబీ కుస్తీ..

13-02-2026 05:44:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ రెండు రౌండ్లలో 34 వార్డుల స్థానాలు లెక్కింపుపూర్తిచేశారు.ప్రతి రౌండ్ తీవ్ర ఉత్కంఠత మధ్య సాగింది. మొదటి రౌండ్లో 17 స్థానాలు, రెండో రౌండ్లో 17 స్థానాలు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, గులాబీ పార్టీల  మధ్య ఫలితాల పందెం పోటీలా ఆసక్తిగోలిపింది.

లెక్కింపు ప్రక్రియ మొదటి నుంచి రెండు పార్టీల మధ్య యుద్ధాన్ని తలపించింది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఫలితాలను సమంగా కైవసం చేసుకుంటూ తీవ్ర ఉత్కంఠత ను రేపాయి. 34 వార్డు స్థానాల్లోనూ  కాంగ్రెస్, బీఆర్ఎస్  14 చొప్పున సేరిసగం పంచుకున్నాయి. ఇదే క్రమంలో స్వతంత్రులు  5 స్థానాల్లో గెలిచారు. బీజేపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. స్వతంత్రులే  కీలకంగా మారారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుపై నే పురపాలన పగ్గాలు   సొంతమవుతాయి. ఈ బలబలాల పైనే ప్రత్యేక దృష్టి సారించారు. ప్రలోబాలు ఈ ఐదుగురి చుట్టే తిరుగుతున్నాయి.

విజేతలు...

1 వార్డు నుంచి  ప్రసన్న కొయ్యడ (బీఆర్ఎస్),2 వార్డు నుంచి  ఇండిపెండెంట్  నిచకోల వంశీ కృష్ణ, 3 వార్డు నుంచి  సౌజన్య లక్కాకుల (బిఆర్ ఎస్),4 వార్డు ఈట కమల (బిఆర్ఎస్),5 గోగర్ల స్వప్న (బిఆర్ఎస్),6 వార్డు నుంచి సల్లా కృష్ణవేణి (బీఆర్ఎస్),7 వార్డు నుంచి దావా స్వాతి ( కాంగ్రెస్),8 వార్డు నుంచి  నిజామోద్దీన్( కాంగ్రెస్),9వార్డు నుంచి  కాంపెల్లి రాజం (బీఆర్ఎస్),10 వార్డు నుంచి డీకొండ పద్మ (కాంగ్రెస్),11వార్డు నుంచి గాలి సుమలత (కాంగ్రెస్),12 వార్డు నుంచి తిరుమల వాసు (కాంగ్రెస్),13 వార్డు నుంచి దొంగల రాజ్‌కుమార్ (బీఆర్ఎస్),14 వార్డు నుంచ్  బి.ఆర్.ఎస్. అసాది మధుకర్ (బీఆర్ఎస్),15 వార్డు నుంచి  చింతల వసంత (కాంగ్రెస్),16 వార్డు నుంచి  మత్తమరి రాయమల్లు (ఇండిపెండెంట్),17 వార్డు నుంచి రాగంశెట్టి సత్యనారాయణ (కాంగ్రెస్),18 వార్డు నుంచి బత్తుల అనిత (బీఆర్ఎస్),19 వార్డు నుంచి సిమ్రాన్ షేక్ బీఆర్ఎస్),20 వార్డు నుంచి తాండ్ర స్రవంతి (బీఆర్ఎస్),21వార్డు నుంచి  రాజనాల రమేష్ (బీఆర్ఎస్),22 వార్డు నుంచి పీక ఎల్లబాయి (ఇండిపెండెంట్), 23 వార్డు  జంగం కల్పన (కాంగ్రెస్),24 వార్డు నుంచి  దామెర విజయలత (కాంగ్రెస్),25 వార్డు నుంచి కంకటి ప్రణిత (కాంగ్రెస్),26 వార్డు నుంచి ఇప్ప కుమార స్వామి (కాంగ్రెస్),27 వార్డు నుంచి బేతి శ్రావణ్ కుమార్ (కాంగ్రెస్), 28 వార్డు నుంచి చిప్ప అర్చన (కాంగ్రెస్), 29 వార్డు నుంచి మేడి పున్నం చంద్ (కాంగ్రెస్),30 వార్డు నుంచి సుకేశిని భరద్వాజ (ఇండిపెండెంట్),31వార్డు నుంచి  బండారి స్రవంతి (బీఆర్ఎస్),32 వార్డు నుంచి నీలి హారిక (కాంగ్రెస్),33 వార్డు నుంచి పోలు ఉమాదేవి (ఇండిపెండెంట్), 34 వార్డు నుంచి  కొక్కుల రామ్మూర్తి (బీజేపీ) గెలుపొందారు.

ఆ ఆరుగురే ఇంద్రులు చంద్రులు..

మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సరి 14 చొప్పున సమాన స్థానాలు ఇచ్చారు. ఇందులో ఐదు ఇండిపెండెంట్ లు, ఒక బీజేపీ అభ్యర్థి నీ ఆదరించారు. టికెట్ల కేటాయింపుల్లో జరిగిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ కి పూర్తి మెజార్టీ రాలేకపోయింది. రెబల్ సే పోటీ చేసి గెలుపొంది  తమ సత్తా ను చాటుకున్నారు. విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర అభ్యర్థులే దిక్కయ్యారు. ఓటర్ చైతన్యంతో తీర్పించి స్వతంత్రులకు పెద్దపీట వేసినట్టయింది. ఈ క్రమంలో ఇండిపెండెంట్  ఐదుగురు, బిజెపి నుంచి  ఒకరు ఈ ఆరుగురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కీలకంగా మారారు. ఈ ఆరుగురి కేంద్రంగా సమీకరణలు రసవత్తరంగా మారాయి.

కౌంటింగ్ ఒకరోజు ముందే కాంగ్రెస్, బిఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలకు శ్రీకరం చుట్టాయి. అభ్యర్థులంతా వారి వారి క్యాంపుల్లోనే తలదాచుకున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకే ఇరు పార్టీలు తమ తమ అభ్యర్థులను శిబిరాల్లోకి తీసుకువెళ్లారు. కౌంటింగ్ లో ఫలితాలను అనుసరించి వారి వారి శిబిరాల్లో ఉన్న గెలిచిన అభ్యర్థులు అక్కడే ఉండి ఓడిపోయిన వారు క్యాంపు నుంచి బయటికి వచ్చారు. ఇది ఇలా ఉండగా బిజెపి ఒక స్థానం రాజకీయంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకు భావిస్తున్నారు. ఈ ఆరుగురు సభ్యుల లక్ష్యంగా భేరసారాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఆరుగురు ఎవరికి మద్దతిస్తే వారే చైర్మన్ పీఠం ఎక్కనున్నారు. 

గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు.

 7 వార్డు దావ స్వాతి.

8 వార్డు ఎండి నిజాముద్దీన్.

10 వార్డు  డికొండ పద్మ 

11 వార్డ్ గాలి సుమలత.

15 వార్డు చింతల వసంత.

17, రాగం శెట్టి సతీష్.

23 వార్డ్ జంగం కల్పన.

24 వార్డులో దామెర విజయ లలిత.

25 వార్డ్ కంకటి ప్రణీత.

26 వార్డులో ఇప్ప కుమారస్వామి.

27 వార్డ్ భౌతి శ్రావణ్ కుమార్.

28 వార్డ్ చిప్ప అర్చన.

29 వార్డ్ మేడి పున్నం చంద్.

32 వార్డ్ నీలి హారిక.

గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు.

1 వార్డ్ కొయ్యడ ప్రసన్న.

3 వార్డ్ లక్కాకుల సౌజన్య.

4 వార్డ్ ఈట కమల.

5 వార్డ్ గోగర్ల స్వప్న.

6 వార్డ్ సల్ల కృష్ణవేణి.

9 వార్డు కాంపెల్లి రాజం.

12 వార్డులో తిరుమల వాసు ధరావత్.

13 వార్డ్ దొంగల రాజకుమార్.

14 వార్డులో ఆశాది మధు.

18 వార్డులో బత్తుల అనిత.

19 వార్డ్ ఎస్ కె సిమ్రాన్.

20 వార్డు తాండ్ర స్రవంతి.

21 వార్డు రాజనాల రమేష్.

31 వార్డ్ బండారి స్రవంతి.

బిజెపి అభ్యర్థులు.

34 వార్డులో కొక్కుల రామ్మూర్తి.

స్వతంత్ర అభ్యర్థులు.

 33 వ వార్డు పోలు ఉమాదేవి.

2 వార్డు నిచ్చకోల వంశీ.

16 వార్డ్ మతమారి రాయమల్లు.

22 వార్డ్ పీక ఎల్లాబాయ్.

30 వార్డ్ సుకేశిని భరద్వాజ్.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులలో కాంగ్రెస్ 14, టిఆర్ఎస్ 14, బిజెపి 1, స్వతంత్ర అభ్యర్థులు 5.