30 August, 2026 | 9:43 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

గీత కార్మికుడి కుటుంబానికి రూ.39 వేలు అందజేత

06-07-2026 01:04 AM

కేసముద్రం, జూలై 5 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ పరిధిలోని కేసముద్రం (వి)కి చెందిన గీత కార్మికుడు ఉట్కూరి శ్రీనివాస్ ఇటీవల తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కిందపడి చికిత్స పొందుతూ మరణించాడు. అతని కుటుంబానికి కేసముద్రం (వి ) గౌడ సంఘం 39 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసింది. సంఘం తరపున 10 వేలు, సంఘ సభ్యులు తమ వంతు సహాయంగా 29 వేల రూపాయలు అందించడంతో మొత్తం 39 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం విలేజ్ గౌడ సంఘం అధ్యక్షుడు రడం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కదిర శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పెద్దగోని సురేందర్ గౌడ్, సంఘ సభ్యులు రడం వెంకన్న, రడం చిన్న వెంకన్న, చిర్ర యాకాంతం గౌడ్, ఉట్కూరి అశోక్ గౌడ్, కొత్త శ్రీనివాస్ గౌడ్, చింతనూరి సతీష్ గౌడ్, దొనికల రాజు, కదిర చక్రపాణి, రడం నారాయణ, రడం రామచంద్రు, ఉట్కూరి రాజు, సుదగాని సతీష్ గౌడ్, అబ్బగోని యాకయ్య, బైరు వెంకన్న, ఉట్కూరి రవిశంకర్, కదిర సోమయ్య పాల్గొన్నారు.