25 February, 2026 | 3:01 AM

మైనార్టీ సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష

25-02-2026 01:29 AM

కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 24,(విజయక్రాంతి): తెలంగాణ మైనారిటీ కమిషన్  చైర్మెన్ తారిక్ అన్సారీ మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా యందు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను గురించి సమీక్షించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్య అక్కడ శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణం నెలకొల్పిన జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పనితీరును ప్రశంసిస్తూ మైనార్టీ కమిషన్ చైర్మన్  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర ను అభినందించారు.

సమస్యాత్మక పరిస్థితుల్లో చట్టం , శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించిన విధానం అభినందనీయం అని తెలిపారు. ప్రజల్లో నమ్మకం కల్పిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందుకు  ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జయరాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బషీర్, ఆర్‌ఎల్సీ, విజిలెన్స్ అధికారులు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.