21 June, 2026 | 2:44 AM

గోషామహల్ మొజంజాహి మార్కెట్‌లోని పురాతన పబ్లిక్ పాఠశాలను మెట్టు సాయికుమార్ సందర్శించారు

21-06-2026 01:29 AM

గోషామహల్, (విజయక్రాంతి) : గోషామహల్ మొజంజాహి మార్కెట్‌లోని పురాతన పబ్లిక్ పాఠశాలను శనివారం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు నూతన దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆయన పాఠశాలకు వచ్చారు. నూతన పుస్తకాలు వస్తువులు అందుబాటులోకి వస్తున్న విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు సీఎంకి, మెట్టు సాయికుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.