23 March, 2026 | 3:56 AM

మున్సిపల్ వైస్‌చైర్మన్‌ను సన్మానించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు

23-03-2026 12:46 AM

ఎల్లారెడ్డి, మార్చి 22 (విజయక్రాంతి): తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ను మత్తమాల భాగ్యవతి ని, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి  సన్మానించారు. వైస్ చైర్మన్ మత్తమాల భాగ్య వతి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తేనీటి పానీయాలు అందజేసి మహిళలతో కాసేపు వారి సమస్యల పట్ల ముచ్చటించారు.

ముఖ్యంగా మహిళ ఉపాధ్యాయినిలు వచ్చి సన్మానించడం సంతోషదాయకమని, ఇది మహిళల గౌరవాన్ని కాపాడే శుభసంకేతమని, రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఏ దేశంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో, వారి హక్కులు కాపాడబడతాయో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంఘ సభ్యుల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో  అమీల, వసంత, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కనీరామ్ మెగావత్, మండల ఉపాధ్యక్షులు నౌశ్య, కార్యదర్శులు శివరాములు, వినోద్, గృహిణి కవితకనిరామ్, జిరాక్స్ వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.