23 March, 2026 | 4:15 AM

పరిహారం ఇవ్వండి

23-03-2026 12:46 AM

ఆ తర్వాతే మూసీ ప్రక్షాళన

  1. హామీల అమలుకే నిధులు లేవు
  2. మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడివి?
  3. రోజురోజుకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతోంది 
  4. టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఎక్కడైనా కూల్చివేతలు జరిగితే.. ముందుగానే పరిహారం అందజేయాలని, కూల్చిన తర్వాత ఇస్తామనే విధానం సరికాదన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 10 వేల ఇళ్లు కూలుస్తామని అంటుంటే.. మరో వైపు ఒక మంత్రి అసెంబ్లీలోనే 14 వేల ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, ఇందులో అసలు నిజమేది..? ప్రజలు ఎవరిని నమ్మాలో ఆర్థం కావడం లేదన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు’ అంశంపై రాంచందర్‌రావు అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకే నిధులు లేవంటున్నారని.. మరి మూసీ ప్రక్షాళనకు డబ్బు లు ఎక్కడినుంచి వస్తాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. గతంలో తాము గండిపేట నీళ్లు తాగుతున్నామని గొప్పగా చెప్పుకునే వాళ్లమని పేర్కొన్నారు. రానురాను మంచినీరు కలుషితమవు తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మూసీ నది నీరు చూస్తే.. ఈ నీళ్లే నా ఒకప్పుడు ప్రజలు తాగింది అని ఆశ్చర్యపోవాల్సి వస్తున్నదని అన్నారు.

ఈ నది వల్ల నల్లగొండ, హైద్రాబాద్‌లో పంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. డెవలప్‌మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే లేదని అన్నారు. 60 ఏళ్ల పాటు పాలించినప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయలేదంటూ కాంగ్రెస్ నేతలపై రాంచందర్‌రావు మండిపడ్డారు. మొదట రూ. 5 వేల కోట్లుగా చెప్పిన ప్రాజెక్టు కొన్ని రోజుల్లోనే రూ. 7వేల కోట్లకు పెరిగిందని, ప్రభుత్వానికి ఖర్చులపైన కూడా స్పష్టత లేదన్నారు. 

మూసీ ప్లానింగ్ సరిగాలేదు: వెదిరె శ్రీరాం

మూసీనది మనందరిదని.. దాని వెంట జీవించే ప్రజల జీవనాధారంతోపాటు వారి భవిష్యత్తుతో ముడిపడి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు వెదిరె శ్రీరాం వివరించారు. మూసీ సుందరీకరణకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కానీ మూసీ సుందరీకరణ చేసేవిధానాన్ని మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. మూసీ ప్లానింగ్ సరిగాలేదని.. ప్లానింగ్ సరిగా లేకపోతే బాధాక రంగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశం చాలాగొప్పదని.. చాలా జీవనదులున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూసీలో చేపలు జీవించేలా.. మనుషులు ఈత కొట్టేలా.. నదిని సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని డిపార్ట్‌మెంట్స్ వారితో కలిసి పనిచేస్తేనే మూసీప్రక్షాళన విజయవంతం అవు తుందని వెదిరె శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన జరుగుతున్నదని ఆయన గుర్తుచేశారు. రూ.160 కోట్ల డీపీఆర్‌తో ఏంచేస్తున్నారో తెలియడం లేదని సందేహం వ్యక్తంచేశారు.

తాము తయారు చేసి న మూసీ మొదటి డీపీఆర్ ఇవ్వమంటే తమ అధ్యక్షుడు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగానే ఇచ్చేస్తామని పేర్కొన్నా రు. మూసీ మిడిల్ పాయింట్ నుంచి రెండు వైపులా 100 మీటర్ల మేర బఫర్‌జోన్ అం టున్నారని తెలిపారు. మూసీకి రెండు వైపు లా గోడ నిర్మించడం సరికాదన్నారు.

స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ లేనిదే ఇలాంటి ప్రాజెక్టులు ముందుకు వెళ్లవన్నారని వెదిరె శ్రీరా మ్ తెలిపారు. వాటర్ క్వాలిటీతోనే ఏదైనా సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. సబర్మతికి రూ.1,100 కోట్లు ఖర్చు అయితే రూ.1,500 కోట్లు రెవిన్యూ వస్తున్నదంటూ వెదిరె శ్రీరామ్ గుర్తుచేశారు.