23 March, 2026 | 5:41 AM

వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

23-03-2026 12:48 AM

ధర్మపురి, మార్చి 22 (విజయ క్రాంతి): గొల్లపల్లి మండలం వెనుగుమట్ల - బొంకూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 23 నుండి 25 వరకు వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహించనుండగా, మంత్రి ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.