21 June, 2026 | 2:42 AM

విద్యతోనే సమాజంలో గుర్తింపు:బండి రమేష్

21-06-2026 12:00 AM

కూకట్ పల్లి, జూన్ 20,( విజయ క్రాంతి): విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని టిపిసిసి ఉపాధ్యక్షుడు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. బాలానగర్ మండల పరిధి బబ్బుగూడ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులం దరూ విజయమే లక్ష్యంగా పోటీపడి చదవాలన్నారు.రూ.30 వేలకోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించడం ద్వారా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వి ద్యాశాఖకు అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు.

ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చే స్తుందన్నారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేణుక, స్ఫూర్తి,విగ్నేష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాఘవేందర్, డివిజన్ అధ్యక్షులు సతీష్ గౌడ్, ఏఎంసి డైరెక్టర్ రవి గౌడ్, సుధాకర్ రెడ్డి, నరసింహులు, రాజేష్, గోపాల్ చౌదరి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.