21 June, 2026 | 2:42 AM

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

21-06-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్,జూన్ 20(విజయక్రాంతి):ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కాంగ్రె స్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ కు నిరసనగా గాంధీ భవనులో సత్యాగ్రహ దీక్షను శనివారం నిర్వహించారు.

రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షకు నవీన్ యాదవ్ హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సంఘటన ఆలిండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శ సచిన్ సావంత్ లతో కలిసి తన సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిం దన్నారు.

దాన్ని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రాజ్యాంగాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. ప్రతి ప్రజాస్వామ్యవాది ఇటువంటి ధోరణిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.