17 July, 2026 | 1:55 AM

శంకర్‌పల్లిలో కురిసిన వర్షం

17-07-2026 12:00 AM

శంకర్ పల్లి; జూలై 16(విజయ క్రాంతి): సుమారు 26 రోజుల తర్వాత శంకర్ పల్లి మున్సిపాలిటీలో గురువారం ఓ మోస్తరుగా అరగంట పాటు వర్షం కురిసింది. వర్షాకాలంలో కూడా మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలు కురిసిన వర్షానికి కాస్త సేద తీరారు. అయితే శంకర్ పల్లి మండలంలోని అంతప్ప గూడ, సంకేపల్లి, పరివేద, రావులపల్లి, లక్ష్మారెడ్డి గూడా, గాజుల గూడా, కొత్తపల్లి తదితర గ్రామాలపై వర్షం కురియలేదు.

ఆయా గ్రామాలలో రైతులు వేసిన పంటలు ఎండు ముఖం పట్టాయి. దీంతో రైతులు దిగాలి చెందుతున్నారు. ఈ కాస్త వర్షం తమ గ్రామాల శివారులో కురిస్తే పంటలకు ప్రాణం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని ఏరువా గూడా గ్రామంలో వర్షం కురిసింది. మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం, ఫతేపురం, చిన్న శంకర్ పల్లి, బుల్కాపురం ప్రాంతాలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. పట్టణంలోని రిత్విక్ కాలనీలో వర్షం కురిచేయడంతో పిల్లలు రోడ్డుపై కేరింతలు కొడుతూ వర్షంలో తడుస్తూ ఫుట్బాల్ ఆడారు.