జీపీ రికార్డులలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి : జూలై 16( విజయ క్రాంతి): గ్రామపంచాయతీ రికార్డులలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలోని ఇరుకుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ రికార్డులను ఇటువంటి అక్రమాలు జరగకుండా కార్యదర్శులు బాధ్యతారహితంగా వ్యవహరించాలని తెలిపారు.
నర్సరీలను నిర్వహించే పూర్తి బాధ్యత గ్రామపంచాయతీలదే అన్నారు.వన మహోత్సవ కార్యక్రమం వరకు అన్ని రకాల మొక్కలను పెంచుకొని నాటేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మొక్కలకు నీరు అందించడం, సిట్టింగ్ రేటు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, పారిశుద్ధ్య పనులకు, నర్సరీల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుకుంట తండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఏపీవో నాగభూషణం, కార్యదర్శి పుష్పలత పాల్గొన్నారు.






