17 July, 2026 | 2:06 AM

పుట్టుకతోనే మూత్ర నాళాలలో హైపోస్పాడియోస్ లోపం

17-07-2026 12:00 AM

రెండేళ్ల చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స

మేడ్చల్ అర్బన్, జూలై 16 (విజయక్రాంతి): మేడ్చల్  పట్టణంలోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జన్మతః హైపోస్పాడియోస్ సమస్యతో బాధపడుతు న్న రెండేళ్ల చిన్నారికి కన్సల్టెంట్ యురాలజిస్ట్ డాక్టర్ నితేష్ బత్తల అత్యంత క్లిష్టమైన టిప్(TIP) యూరోథ్రోప్లాస్టి శాస్త్రచ్కిత్సను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నితేష్ బత్తల మాట్లాడుతూ పుట్టుకతోనే చిన్నారిలో మూత్ర నాళం సహ జ స్థానంలో లేకపోవడం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తె లిపారు. ముక్యంగా ఇలాంటి సమస్యలో ప్ర ధానంగా మూత్ర నాళం యొక్క ద్వారం పు రుషాంగం కొన వద్ద కాకుండా దాని కింది భాగంలో అభివృద్ధి చెందుతుందని డాక్టర్ వెల్లడించారు.

దీని వలన మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా లైంగిక సంబంధమైన సమస్యలతో సంతానోత్పత్తి పై ప్రభావం ఏర్పడుతుందని తెలిపారు.  డాక్టర్ నితేష్ బత్తల నేతృత్వంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నారికి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.