17 July, 2026 | 2:03 AM

నేడు మంద కృష్ణ మాదిగ రాక

17-07-2026 01:49 AM

సాధన కమిటీ నాయకుడు సుందర్ పాల్

మహబూబ్ నగర్ టౌన్, జూలై 16: దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకొనేందుకు ఐక్యంగా ఉద్యమానికి  సిద్ధమవుతున్నట్లు దళిత క్రైస్తవుల హక్కుల సాధన కమిటీ నాయకులు పాస్టర్ సుందర్ పాల్ అన్నారు. శనివారం జేజేఆర్ ఫంక్షన్ హల్ నందు ఏర్పాటు చేసిన క్రైస్తవుల సమావేశంలో వారు మాట్లాడారు. 

ఈనెల శుక్రవారం స్థానిక   జేజేఆర్ ఫంక్షన్ హాల్   దళిత క్రైస్తవ గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవ గర్జన కార్యక్రమం ద్వారా ఐక్యతను చాటుతామని ఇందుకు దళిత క్రైస్తవులంతా ఏకం కావాలన్నారు. చాలా ఏళ్ళ నుండి దళిత క్రైస్తవులపై దాడులతోపాటు అణచివేత ఘటనలను జరుగుతున్నాయని ఇక వాటిని సహించేది లేదని అన్నారు. దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకొని తమకు రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. 

లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశస్థాయికి తీసుకెళ్లి తీవ్రతరం చేసి తమ సమస్యల్ని సాధించుకుంటామన్నారు. నేడు నిర్వహించే దళిత క్రైస్తవ గర్జనకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు  మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. దళిత క్రైస్తవ జేఏసి కన్వీనర్  ప్రసాద్, యోనా,  డేవిడ్,S జగన్, టైటస్ పాల్గొన్నారు.