17 July, 2026 | 12:41 AM

ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా తెలంగాణ

17-07-2026 12:34 AM

బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ఫలించడం సంతోషం: కేటీఆర్

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన మా ప్రయత్నాలు ఫలించడం చూసి చాలా సంతోషంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

తెలంగాణ, మహబూబ్‌నగర్‌లోని తన గిగా కారిడార్‌లో అమర రాజా సంస్థ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించిందని, ఇది మహబూబ్‌నగర్‌లో ఆ సంస్థ పెట్టనున్న రూ. 9,500 కోట్ల పెట్టుబడిలో ఒక కీలక మైలురాయి అని స్పష్టం చేశారు. మేము సాధించగలిగిన అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ (ఇంధన నిల్వ) పెట్టుబడులలో ఇదీ ఒకటి అని గుర్తు చేశారు.