17 July, 2026 | 2:06 AM

రోడ్డు విస్తరణలో అందరికీ సమాన న్యాయం చేయాలి

17-07-2026 01:53 AM

పెబ్బేరు, జూలై 16: పెబ్బేరు వనపర్తి ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో బాధితులందరికీ సమాన న్యాయం చేయాలని బీజేపీ పెబ్బేరు పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు రహదారి విస్తరణలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించింది. రహదారి విస్తరణలో ఎలాంటి వివక్ష లేకుండా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నాయకులు కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కావలి క్రాంతికుమార్, జిల్లా నాయకులు, రహదారి విస్తరణ బాధితులు పాల్గొన్నారు