5 May, 2026 | 8:43 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

రోడ్డు నిర్మాణ పనులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

05-05-2026 07:28 PM

ఆర్&బి ఈఈ సీతారామయ్య

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని చెన్నై పాలెం, క్రింది తండా,వరదాపురం పంచాయతీ పరిధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన రోడ్లను రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారామయ్య స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా అమరవరం నుండి అలింగాపురం వరకు 26 కోట్లతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కాలినడకన వెళ్ళి పనులను పరిశీలించి, గిరిజనులతో కొంతసేపు మాట్లాడారు.

అలాగే చెన్నైపాలెం, క్రింది తండా గ్రామాలలో 11 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు పనులను పరిశీలించారు. రోడ్డు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్,చెన్నాయి పాలెం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్,కింది తండా సర్పంచ్ మాలోతు జ్యోతి శ్రీను నాయక్, ఆర్ అండ్ బి డిఈ రమేష్ బాబు, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.