డిసిసిబి మేనేజర్‌కు సన్మానం
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) ఆసిఫాబాద్ బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సహకార బ్యాంకులు ముఖ్యమైన అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రవీందర్ రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించి, రుణాల పంపిణీ, పంట రుణాల సౌకర్యాలను వేగవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెంకట్ రవీందర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా పారదర్శకంగా సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. బ్యాంకు సేవలను గ్రామీణ స్థాయికి మరింత చేరువ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు PACS అధ్యక్షులు, రైతు నాయకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.






