29 April, 2026 | 10:50 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఎఫ్‌ఏక్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలి

28-04-2026 12:00 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి, ఏప్రిల్ 27 ( విజయక్రాంతి ) : యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని కనిమెట్ట, కానాయిపల్లి, పాలెంతో పా టు కొత్తకోట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పా టు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

అదేవిధంగా ఆయా సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న తీరును పరిశీలించి, సెంటర్ల ఇన్చార్జిలకు పలు కీలక సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ ఏ క్యూ నిబంధనలకు అనుగుణంగానే కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యాన్ని సక్రమంగా పరిశీలించి కొనుగో లు చేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, కొత్తకోట తహసిల్దార్, ఇతర అధికారులు తదితరులు అదన పు కలెక్టర్ వెంట ఉన్నారు.