హైదరాబాద్‌లో సైన్ లబాన్ షురూ
మూడు అవుట్‌లెట్లను ప్రారంభించిన నటి రాశి సింగ్
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌లో ఘ నంగా ప్రారంభమైంది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేసారి మూడు అవుట్‌లెట్లను హీరోయిన్ రాశి సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశి సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన సైన్ లబాన్ హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రత్యేక ఈజిప్షియన్ డెజరట్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయన్నారు.
బ్రాండ్ ఫౌండ ర్స్ రిసియాస్, హాశిమ్, రిషద్ మాట్లాడుతూ.. కేరళలో ప్రారంభమైన సైన్ లబాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 అవుట్లెట్లకు విస్తరించిందని, ఇప్పుడు హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ సిటీ పార్ట్‌నర్స్ గంగా విరాజ్, గంగా ధీరజ్ మాట్లాడుతూ.. నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి డెజర్ట్ అనుభూతిని అందించేందుకు ఒకేసా రి మూడు అవుట్లెట్లను ప్రారంభించామని, త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర ప్రముఖులు, ఫుడ్ బ్లాగర్లు, డెజర్ట్ ప్రియులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అర్ష్లింక్ స్ట్రాటజిక్స్ అతిథులకు ప్రత్యేక ఈజిప్షియన్ డెజర్ట్స్, స్వీ ట్లు, హై-టీతో ఆతిథ్యం ఇచ్చింది.






