2 September, 2026 | 8:52 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

06-07-2026 | 02:34am

లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో నిర్వహణ

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): 4వ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2026 ఉత్సాహభరిత వాతావరణంలో ఘ నంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల పాల్గొనడంతో టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది.

ముఖ్య అతిథిగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా హాజరై ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రత్యే క అతిథిగా వసంత్ భరద్వాజ్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఉప్పల్ ప్రిన్సిపాల్ డా. బ్రదర్ జోసెఫ్ పసాలా, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రెవ. బ్రదర్ ఆంథోనీ పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె. కె. మహేశ్వరి, గౌరవ కార్యదర్శి పి. నాగేందర్ రెడ్డి, సలహాదారు ప్రకాష్ రాజు, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ టేబుల్ టెన్నిస్ జట్టు మెంటర్ ఎం. దీపేష్ సింగ్ పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వహణలో ఆర్గనైజిం గ్ సెక్రటరీ బి.టి. అజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.