calender_icon.png 14 February, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్వామా దాడి.. ఒక చీకటి రోజు

14-02-2026 06:32:55 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పుల్వామా దాడి ఒక చీకటి రోజుగా దేశమంతా భావిస్తుందని, సైనికుల వల్లనే మనం దేశంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నామని ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనేయులు అన్నారు. శని వారం మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువత సైనికుల అడుగుజాడల్లో నడవాలని, దేశ రక్షణకు సైనికులుగా మారాలన్నారు.

బతకడం అంటే కేవలం స్టాఫ్ట్ వేర్, లేక ప్రభుత్వ ఉద్యోగాలే కాదని, దేశాన్ని కాపాడటంలో మనం కూడా భాగస్వాములం కావాలని, యువతరం చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిట్ నెస్ సెంటర్ సభ్యులు డాక్టర్ నర్సయ్య, శ్రీనాథ్, రామన్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అశోక్, గట్టయ్య, స్వామి, ముక్త వేణు, బాక్సింగ్ అసోసియేషన్ విద్యార్థులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.