31 August, 2026 | 10:24 AM

Breaking News

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •  

ఆగస్ట్ 1న కోల్‌కతాకు తస్లీమా నస్రీన్

15-07-2026 01:39 AM

20 ఏళ్ల తరువాత బంగాల్‌లోకి ప్రవేశం

కోల్‌కతా, జూలై 14: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ 20 ఏళ్ల తరువాత కోల్‌కతాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ మాధ్యమంలో తెలిపారు. ఆగస్ట్ 1న కోల్‌కతాలోని రవీంద్ర సదన్‌లో జరిగే తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు కవులు, రచయితలు పాల్గొంటున్నారు. 2007లో తస్లీమా కోల్‌కతాను విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వామపక్ష ప్రభుత్వ పాలనలో ఆమెకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగి, శాంతిభద్రతల సమస్యలకు దారితీసింది.

ఆ తరువాత పలుమార్లు ఆమె కోల్‌కతాకు వచ్చేందుకు ప్రయత్నించినా భద్రతా కారణాల దృష్ట్యా ఆమె కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తస్లీమా కోల్‌కతా రావడం, పర్యటన ఖరారు కావడం ఎటువైపు దారితీయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. కాగా 1993లో తస్లీమా నస్రీన్ రాసిన ‘లజ్జ’ అనే పుస్తకం కారణంగా బంగ్లాదేశ్‌ను వీడాల్సి వచ్చింది.