calender_icon.png 14 February, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

14-02-2026 05:59:07 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ శనివారం ఎస్‌ఆర్ నగర్ డివిజన్ బాపునగర్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రవి కిరణ్, బాలు నాయక్, తరుణ్ జాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ఆమె పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్ మహరాజ్ అని పేర్కొన్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమం మరియు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్‌.ఎస్‌. రావు, శ్రీకాంత్ యాదవ్, పద్మావతి, పింకీ భాయ్, మదన్ సింగ్, ప్రతాప్ నాయక్, కృష్ణ కుమార్, అర్ఫాట్, మహేష్, వినోద్ , అనిత , రాజేష్, సునీత, అండలు తదితరులు పాల్గొన్నారు.