4 July, 2026 | 3:19 AM

ప్రజా నిరసనలు బేఖాతర్..

04-07-2026 02:19 AM
  1. సిద్ధాపూర్‌లో ఎకోటౌన్ (డంపింగ్ యార్డ్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
  2.   86 ఎకరాల భూమి బదిలీ చేస్తూ జీవో నెం. 641 జారీ

షాద్ నగర్, జూలై 2 (విజయక్రాంతి): కొత్తూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామం లో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఎకో టౌన్ ప్రాజెక్టు (డంపింగ్ యార్డ్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు భూమి బదలాయింపునకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్డబ్ల్యూఎం) సదుపాయాల ఏర్పాటు కోసం సిద్ధాపూర్ గ్రామం లోని సర్వే నంబర్లు 252, 278, 361లలో గ ల మొత్తం 86 ఎకరాల భూమిని వినియోగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ (జీహెచ్‌ఎంసీ-2) శాఖ జీవో నెం. 641ను విడుదల చేసింది.