నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాయిని
04-07-2026 02:19 AM
హనుమకొండ, జూలై 03 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం 53వ డివిజన్ పరిధిలోని హనుమంతరావు నగర్లో గల శ్రీ వెంకట గణేశ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న త్రయాహ్నిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించగా, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.






