ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్
- పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు
- రాష్ట్ర ప్రభుత్వంలో బాత్రూంలో కట్టడానికి కూడా నిధులు లేవు
- ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పబ్లిక్ స్కూళ్లు అంటూ మోసం
- ఉన్న స్కూళ్లను బాగు చేయొచ్చు కదా
- టీచర్లు లేరు.. వసతులు లేవు
- కాంగ్రెస్ ది యాక్టింగ్ ప్లాన్.. యాక్షన్ ప్లాన్ కాదు
- మీడియా సమావేశంలో ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం "99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" ఉట్టి బోగస్ అని రాష్ట్ర ప్రభుత్వంలో బాత్రూంలో కట్టడానికే నిధులు లేవని, ఇక ప్రగతి ఎక్కడ ఉంది ఏం ప్రణాళిక చేస్తారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నదని మహిళలకు ఇస్తానన్న రూపాయలు 2500, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలను అమలు చేయకుండా మళ్లీ కొత్తగా ప్రగతి ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు అన్నారు.
కాంగ్రెస్ ది యాక్టింగ్ ప్లాన్ తప్ప యాక్షన్ ప్లాన్ లేదన్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్లు మళ్లీ తాజాగా పబ్లిక్ స్కూళ్లు అంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్నారు. ఉన్న స్కూళ్లను బాగు చేసి మౌలిక వసతులు కల్పించి టీచర్లను నియమించాలని సూచించారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగలేని పరిస్థితి నెలకొందని ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎమ్మెల్యేల ముఖాలను గ్రామాల్లో చూపించాలని ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు.




