పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ పక్కాగా చేపట్టాలి
రెండో రోజు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ సూపరిండెంట్లు రెవిన్యూ సిబ్బందితో కలిసి కార్యాలయ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండో రోజులో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహించిన పరిశుభ్రత ఫైళ్ళ క్రియారెన్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, వేగంగా పూర్తి చేయాలని హితవు పలికారు. మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లలు భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, చిన్న సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.




