మహా విజ్ఞాపన సభకు వెళ్లిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులు
మెదక్,(విజయక్రాంతి): డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం మరియు ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పాత పెన్షన్ విధానంలో అమలు చేయాలని శనివారం 2003 ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత పెన్షన్ పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహా విజ్ఞాపన సభకు మెదక్ పట్టణం నుండి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి మెదక్ జిల్లా కన్వీనర్లు తాళ్ల శ్రీనివాస్, శిరేగే చంద్రశేఖర్ లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో 2003 వారికి పాత పెన్షన్ విధానమును అమలు చేశాయని అదే మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ బయలుదేరిన పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు వెంకటేశం, ప్రభు, సిద్ధార్థ శంకర్, పోచయ్య, అశోక్ సంతోష్, రామలింగం తదితరులు ఉన్నారు.




