16 August, 2026 | 11:14 PM

Districts - Mahabubnagar

article_75266500.webp
వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి జూపల్లి

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. శనివారం నగరం లోని ఫారెడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి. సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.డి.ఎ) ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన రుణాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 1,219 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.143 కోట్ల రుణాల చెక్ ను మంత్రి మహిళ సంఘాల సభ్యులకు అందజేశారు.

15-08-2026

article_50171376.webp
అంగరంగ వైభవంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మూసాపేట్ ఆగస్టు 15: మూసాపేట్ మండల కేంద్రంతో పాటు తాసిల్దార్ కార్యాలయం ,ఎంపీడీవో కార్యాలయం ,పోలీస్ స్టేషన్, కస్తూరిబా ఉన్నత పాఠశాల తో పాటు వివిధ గ్రామాల గ్రామపంచాయతీ ఆఫీస్ లో దగ్గర శనివారం జాతీయ జెండా ను ఎగరవేసి అంగరంగ వైభవంగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలమే నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజు నాయక్ ,ఎస్సై వేణు, ఎంపీడీవో కృష్ణయ్య, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_89566022.webp
సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. హల్దాని ఘటనకు నిరసనగా, ఏఐసీసీ అధ్యక్షురాలు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ నాయకత్వంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్దీకరణ పేరుతో అవమానకరంగా వ్యవహరించడం సరికాదన్నారు.

15-08-2026