6 May, 2026 | 2:00 PM

పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

06-05-2026 01:09 PM

చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్

ఖానాపూర్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ బిజిలి పథకాన్ని(PM Surya Ghar Bijli Scheme) సద్వినియోగం చేసుకొని ప్రజలు లబ్ధి పొందాలని చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ బిజిలి  పథకం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉపయోగం, వినియోగం పై రైతులకు, ప్రజలకు అవగాహన కలుగజేశారు.

ఈ పథకానికి బ్యాంకుల నుంచి  78,000 సబ్సిడీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా, అదనపు విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించుకోవడానికి, తద్వారా ఆర్థిక  లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందని వివరించారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జక్కుల నరసయ్య ,జక్కుల చంద్రకళ, మద్దెలపల్లి రాజ్ కుమార్ ,మద్దెలపల్లి మహేందర్ ,రాములు, పలువురు పాల్గొన్నారు.