16 August, 2026 | 11:51 AM

Districts - Nirmal

article_37307370.webp
కోర్టు ఆవరణలో జెండా పండుగ

నిర్మల్, ఆగస్టు 14 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి జెండా ఆవిష్కరించారు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

15-08-2026

article_17349316.webp
అందరి సంక్షేమం మోడీ ప్రభుత్వ ధ్యేయం

భైంసా ,ఆగస్టు 14 (విజయక్రాంతి): దేశంలో అందరి సంక్షేమమే మోడీ ప్రభుత్వ దేయమని అందుకే ప్రభుత్వం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన భారత్ 80 ఏళ్లలో అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అనంతరం భైంసా బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

15-08-2026

article_22288547.webp
జెండా ఎగరేసిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ ,ఆగస్టు 14 ( విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ బిజే ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాస భవనంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనపై అప్పటి మహా నాయకులు పోరాటం చేసి స్వతంత్ర భారతదేశంలో 1947లో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. భారతదేశంలో మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్. పార్టీ నాయకులు రమణారెడ్డి చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.

15-08-2026

article_77922778.webp
ఉత్తమ అవార్డులు అందుకున్న అదనపు కలెక్టర్లు

నిర్మల్ ఆగస్టు 14 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ అవార్డుల పంపిణీ ప్రభుత్వ చీఫ్ వీప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అధికారులు అవార్డులను స్వీకరించారు. అవార్డు స్వీకరించిన వారిలో స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, ఏ ఎస్ పి సాయికుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ తో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు ఈ అవార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, నిర్మల్ డిఎఫ్ఓ ప్రశాంత్ సుఖదేవ్ ఆర్ డి ఓ రమేష్ రాథోడ్ జిల్లా అధికారులు ఉన్నారు.

15-08-2026