మోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి
వాల్ రైటింగ్‌తో పిలుపునిచ్చిన సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన బుధవారం కరీంనగర్‌లో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.
భగత్ నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద గోడపై స్వయంగా రాతలు రాస్తూ సభ వివరాలను ప్రజలకు వివరించారు. కరీంనగర్ జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు సభకు తరలి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ప్రధాని పర్యటనకు సంబంధించిన వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.






