11 April, 2026 | 8:06 PM

మార్కెట్ ఎండికి వినతి

11-04-2026 06:35 PM

భైంసా,(విజయక్రాంతి): ముధోల్ అసెంబ్లీతో పాటు కుంటాల మండల కేంద్రంలో ఇటీవలే కురిసిన వర్షానికి గాలి దుమారానిక చేతికి వచ్చిన పంట నెల పాలు అవుతున్న వెంటనే కొనుగోలు ప్రారంభించాలని మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డికి విన్నవించినట్టు మాజీ ఎంపీపీ రమణ రావు సర్పంచ్ జక్కుల గజేందర్ తెలిపారు. రైతుల కష్టాన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరగా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే లింబా తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో పాటు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీనికి ఎండీ సానుకూలంగా స్పందిస్తూ సంబంధింత అధికారులతో మాట్లాడి తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తావని   వివరించారు.