11 April, 2026 | 8:55 PM

ఘనంగా వారసత్వ సంబురాలు

11-04-2026 06:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ‘వారసత్వ సంబురాలు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి, సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో రచయితలు విశేషంగా సాహిత్య సృష్టి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, కార్యక్రమ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.