లంబాడి తండాలో కార్డెన్ సెర్చ్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడి తండా గ్రామంలో పోలీసులు శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. లంబడి తండా గ్రామాన్నిపోలీసులు ఆకస్మికంగా చుట్టు ముట్టారు. దేవాపూర్, కాసిపేట,రామకృష్ణాపూర్.ఎస్ ఐ లు, పోలీస్ బలగాలు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (కార్టన్ అండ్ సెర్చ్ )నిర్వహించదమంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నివాస గృహాల్లో ప్రవేశించి సోదాలు చేశారు. అనుమానస్పద వ్యక్తుల సమాచారం,అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉంటున్నారా? అపరచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డులను పరిశీలించారు.
అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు ఆర్ సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లు చెక్ చేశారు. అదేవిధంగా సరైన ద్రువపత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని 43 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటికి అక్కడికక్కడే ఫైన్ వేసశారు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాలను సీజ్ చేశారు. పోలీసులు 180 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి దేవాపూర్ ఎస్సై గంగారాం స్థానిక ప్రజలకు సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కోత్త చట్టాలపై అవగాహన, మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని, ట్రాఫిక్ నిబంధన లను గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో కాసిపేట, రామకృష్ణాపూర్, ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.




