31 July, 2026 | 2:25 AM

దసరా నాటికి పెద్దపల్లి ఆర్టీసీ డిపో సిద్ధం

31-07-2026 12:57 AM

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విజయ రమణరావు

పెద్దపల్లి జూలై 30(విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా ప్రజల దశాబ్దాల చిరకాల ఆకాంక్ష అయిన నూతన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రాబోయే దసరా పండుగ నాటికి డిపో నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోం దని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. గురు వారం జిల్లా కేంద్రంలో శరవేగంగా సాగుతు న్న బస్సు డిపో నిర్మాణ పనులను తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి, పలు సూచ నలు చేశారు.

నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణరావు మాట్లాడుతూ.. డిపో నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూనే, నిర్దేశించిన దసరా గడువులోగా పనులు పూర్తి చేయాల ని కాంట్రాక్టర్, అధికారులకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర రెవెన్యూ డివిజన్లలో డిపోలు ఉన్నప్పటికీ, జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి బస్సు డిపో లేకపోవడం బాధాకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, డిసెంబర్ 2024 లో జరిగిన యువ వికాసం సభ వేదికగా సీ ఎం డిపోను మంజూరు చేశారని గుర్తుచేశా రు. ఇచ్చిన హామీకి కట్టుబడి నిర్మాణం వేగం గా జరిగేలా చూస్తున్నామని చెప్పారు.

మెరుగైన రవాణా సౌకర్యాలు

నూతన డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు, పట్టణా లకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయ ని, సరికొత్త బస్సు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే ధీమా వ్య క్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ము న్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల స ర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.