31 July, 2026 | 3:27 AM

కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరణ

31-07-2026 12:58 AM

ముకరంపుర, జూలై 30(విజయ క్రాంతి)కరీంనగర్ కళాకారుల ఆధ్వర్యంలో ఆగస్టు 5న నిర్వహించనున్న కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్ ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఆగస్టు 5న ఉదయం 9 గంటలకు గీతాభవన్, తెలంగాణ చౌక్ నుంచి బోనాల ర్యాలీ ప్రారంభమై కోతిరంపూర్ పోచమ్మ ఆలయం వరకు కొనసాగుతుందని, అక్కడ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నట్లు తెలిపారు.

అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గోగుల ప్రసాద్, బాబు గౌరవేణి, సంతోష్ తమ్మిశెట్టి తదితరులు పాల్గొన్నారు.