31 July, 2026 | 1:09 AM

పాసుపుస్తకాలు ఇప్పించాలి

31-07-2026 12:56 AM

ఎమ్మెల్యే మదన్ మోహన్కు రైతుల వినతి

నాగిరెడ్డిపేట్, జూలై 30 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామ శివారులోని 93/2 సర్వే నెంబర్లు దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని  తాండూర్,వెంకంపల్లి, లింగంపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే మదన్ మోహన్కు వినతిపత్రం సమర్పించారు.

సుమారు 40 నుంచి 50 సంవత్సరాలుగా 160 మంది రైతులు దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్లో పాసుపుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని,రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజ నాలు కూడా అందడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు.సర్వే నంబర్ 93/2లో సాగులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు.ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు ఉన్నారు.