6 July, 2026 | 1:34 AM

పార్కింగ్ సమస్యలకు వినూత్న డిజైన్‌కు పేటెంట్

05-05-2026 07:22 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు గర్వకారణంగా “Parking Management in Crowded Places” డిజైన్‌కు భారత ప్రభుత్వం పేటెంట్ లభించింది. ఈ డిజైన్‌ను మౌల్కారి కేశవ్, అల్సా మమత, కటుకం మధుకర్ రూపొందించారు. ఈ డిజైన్ రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని అల్సా మమత తెలిపారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఇది జిల్లాలోని విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత విద్యార్థిని అల్సా మమత, ఉపాధ్యాయుడు మౌల్కారి కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ లలిత పాల్గొన్నారు.