6 July, 2026 | 2:32 AM

కరడ్ పల్లికి నైట్ హాల్ట్ బస్ వేయాలి

06-07-2026 01:32 AM

తాడ్వాయి, జూలై 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామానికి నైట్ హాల్ట్ బస్సు వేయాలని ఆదివారం కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్ కు ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరడుపల్లికి గతంలో నైట్ హాల్ట్  బస్సు ఉండేదని, ప్రస్తుతం నైట్ హాల్ట్ బస్సు వేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదాం నర్సింలు, నల్లవెల్లి కపిల్ రెడ్డి,ధర్మారెడ్డి, మంగారెడ్డి, సంగారావు, రాజిరెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.