5 May, 2026 | 8:47 PM

చెరువు కట్టకు మరమ్మత్తులు

05-05-2026 07:19 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామంలో కొత్త చెరువుకు మరమ్మత్తుల పనులను మంగళవారం సర్పంచ్ టెక్రియాలా లావణ్య రమేష్ ప్రారంభించారు. వర్షకాలంలో చెరువు కట్టకు బుంగలు పడి నీటి వృధా అవడంతో కట్ట పూర్తిక శిదిలావస్థకు చేరుకున్న విషయాన్నీ సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా విపత్తుల నిర్వహణ శాఖ నుండి సుమారు 15 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్, కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారాం, పంచాయతీ పాలక వర్గం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.