ఓటు హక్కు పొందడం మీ బాధ్యత
09-07-2026 04:19 PM
భైంసా (విజయక్రాంతి): భారత రాజ్యాంగంలో ఓటుకున్న విలువలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఓటు హక్కు పొందడం బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. గురువారం బాసర గ్రామపంచాయతీలో సర్ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్ ఫారం ప్రతి ఇంటికి పంపినందున వారు పూర్తి చేసి వెంటనే బిఎల్ఓ లకు అందించేలా చూడాలని సూచించారు. ఫారాలు ఓటరు ఓటు హక్కు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని వీటి పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పవనచంద్ర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అధికారులు ఉన్నారు.






