అయిజను జిల్లాలోనే ముందంజలో ఉంచాలి
10-07-2026 02:23 AM
అయిజ, జులై 9: మండల ప్రత్యేక అధికారి రామలింగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పం చాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ప్రత్యేక శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంచిరైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు పూర్తి చేయించాలని, గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, మంజూరైన ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు నిర్మించాలని, అంగన్వాడి భవనాలను పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతన్న నే పథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలుగా శానిటేషన్ చేయించి బ్లీచింగ్ పౌడర్ సిద్ధంగా ఉంచుకోవాలని తగు సలహాలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, మనోహర్, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వారు పాల్గొన్నారు.






