10 July, 2026 | 1:49 AM

మధుమేహానికి వారానికోసారే ఇంజెక్షన్

10-07-2026 12:16 AM

నోవో నోర్డిస్క్ ‘అవిక్లీ’ విడుదల

న్యూఢిల్లీ, జూలై 9 (విజయక్రాంతి): ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నోర్డిస్క్ మధుమేహంతో బాధపడుతున్న వారికి శుభవార్త చెప్పింది. ఇకపై రోజూ ఇన్సులిన్ వాడేవారు వారానికి ఒక్కసారి వాడితే సరిపోతుందని తెలిపింది. తమ సంస్థ ‘అవిక్లీ’ అనే ఇన్సులిన్‌ను తీసుకొచ్చిందని గురువారం ప్రకటన లో తెలిపింది. 700 యూనిట్స్, 2,100 యూనిట్స్ ఇంజెక్షన్ పెన్ ఆప్షన్లతో దేశీయంగా విడుదల చేసింది. ఒక్కో యూనిట్ ఖరీదు రూ. 3.73 ఉంటుందని నోర్డిస్క్  ఐఎండీ విక్రాంత్ తెలిపారు.

‘అవిక్లీ’ బేసల్ ఇన్సులిన్ కంటే మెరుగ్గా పనిచేస్తుందన్నారు. ఏడాదిలో మామూలుగా 365 రోజులు తీసుకుంటామని, అవిక్లీ వాడితే 52 తీసుకుంటే సరిపోతుందన్నారు. టైప్-1, 2 డయాబెటిస్ పేషంట్లు దీన్ని తీసుకోవచ్చన్నారు. దేశంలో 10 కోట్ల మంది మధుమే హంతో బాధపడుతున్నారని వారి ఇబ్బందులను తొలగించేందుకు అవిక్లీ ఉపయోగప డుతుందన్నారు. భారత్‌తో సహా మొత్తం ఏడు దేశాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులో పెడతామని నోర్డిస్క్ ఐఎండీ వెల్లడించారు.