10 July, 2026 | 3:54 AM

మూడో వార్డు ఓటర్లకు కీలక సూచన

10-07-2026 02:25 AM

ఇంటింటికీ బీఎల్‌ఓల ద్వారా ఓటర్ ఫారాలు పంపిణీ

దోమకొండ, జూలై 9 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ మూడవ వార్డు ప్రజలకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఆ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బి ఎల్ ఓ కు తిరిగి అందజేయాలని అధికారులు సూచించారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

మూడవ వార్డు శాంతినగర్లోని మహిళా సమాఖ్య భవనంలో  బి ఎల్ ఓ అర్చన సి ఎ అందుబాటులో ఉంటారని, అక్కడికి వెళ్లి ఉచితంగా ఫారాలు నింపించుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా, మరిన్ని వివరాల కోసం లేదా సహాయం అవసరమైతే 8106019856 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నిర్ణీత గడువులోపు ఫారాలను సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని అధికారులు కోరారు.