అనుమతులు లేకున్నా అడ్డగోలుగా మద్యం విక్రయాలు
- పక్కదారి పడుతున్న యువత
- గ్రామాలలో బెల్ట్ షాపుల జోరు
- వేలం పాటలో పాల్గొని దక్కించుకున్న బెల్ట్ షాప్
- ప్రజల ప్రాణాలతో చెచెలగాటం
తాడ్వాయి, జూలై 9 (విజయ క్రాంతి): అనుమతులు లేకున్నా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా మద్యంవిక్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో నీ గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు.అడిగేది ఎవరనీ విచ్చలవిడిగా బెల్టు షాపులలో మద్యం విక్రయాలు జరుగుపుతున్నారు. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొన సాగిస్తున్నారు.
అడ్డుకునే అధికారులకు నెలసరి మామూలు బెల్ట్ షాపుల నిర్వాహకులు మొట్ట చెబుతున్నారు.ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే గ్రామాల్లో టెండర్లు వేసుకొని మరీ మద్యం విక్రయాలు జరుపుతున్నారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా సాసాగిస్తున్నారు. బహిరంగంగానే మద్యాన్ని అమ్ముతున్న పట్టించుకున్న నాధుడే కరవయ్యారు.
అక్రమ మద్యం విక్రయాలను నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.నెలనెలా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యాపారుల నుంచి అందుతున్న మామూళ్లకు తలోగ్గి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఎక్కడబడితే అక్కడ మద్యం దొరకడంతో యువకులు ఉదయం నుంచే మద్యమత్తులో ఊగిపోతున్నారు. దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తూ మద్యం కోసం పాకులాడుతున్నారు. మండలములోని కరడ్పల్లి,కన్కల్, దేమికలాన్,బ్రహ్మాజీ వాడి, నందివాడ, ఎర్రపహాడ్,ఏండ్రియాల, బ్రాహ్మణపల్లి, చందాపూర్, చిట్యాల, సోమరం గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
అక్రమంగా మద్యం అమ్మిన పట్టించుకోరా...
గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్మిన పట్టించుకోరా.. అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.గ్రామాల్లో అవి బెల్ట్ షాపులు కావు మద్యం షాపులే అన్నట్లుగా షాపుల నిర్వహణ కొనసాగుతుంది.బెల్టు షాపుల్లో అన్ని రకాల మద్యం బాటిల్లు అందుబాటులో ఉంటున్నాయి.ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంత బహిరంగంగా అమ్మడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ విచ్చలవిడిగా మద్యం దొరకడంతో యువకులు పక్కదారి పడుతున్నారని మహిళ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు విక్రయాలు
- - గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో మద్యం బాటిళ్లు,బీరు బాటిల్ లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ రేట్ కన్నా ఎక్కువ ధర నిర్ణయించి అమ్ముతున్నారు. ఎవరైనా ధరలు ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే వారికి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఈ విషయమై ప్రజలు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసిన స్పందించడం లేదని మండిపడుతున్నారు.
అక్రమ మద్యాన్ని నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులే ఏమాత్రం స్పందించకపోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, పోలీసులు గాని ఏ మాత్రం స్పందించకపోవడంతోనే అక్రమంగా మద్యం విక్రయాలు ఎక్కువైపోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమంగా విక్రయిస్తున్న మద్యం విక్రయాలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాలలో టెండర్లు వేసి మరీ మద్యం విక్రయాలు..
- - గ్రామాలలో మద్యం విక్రయాల కోసం కొందరు వ్యాపారులు బహిరంగంగానే టెండర్లు వేసి షాపులను దక్కించుకుంటున్నారు. ఎవరికి ఏం భయమనట్లుగా మద్యం షాపులను కొనసాగిస్తున్నారు.ఇంత జరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించడం పై సర్వత్ర విమర్శలు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా అనే విషయమై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం షాపులను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.






