10 July, 2026 | 2:05 AM

ప్రొఫెసర్ల నిరసన

09-07-2026 04:21 PM

బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంలోని గోపాల్ రావు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ బుచ్చయ్య పై విద్యార్థులు దాడి నిరసిస్తూ గురువారం ప్రొఫెసర్లు నిరసన తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం  వెంటనే చర్యలు తీసుకోవాలని దాడి చేసిన విద్యార్థిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ పై దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వారికి సంఘీభావం  (AIPSU - PDSU - AISB) విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పే గురువులపై దాడులను అస్సలు ఉపేక్షించబోం. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అధ్యాపకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. బాధితులకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాము