కాంగ్రెస్‌ది కమీషన్ల పాలన
- గురుకులాల్లో గుడ్లు, బూట్లు, బట్టలపై కమీషన్
- వాహనాల రేడియం స్టిక్కర్స్‌పైనా వసూళ్లు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కమీషన్లతోనే కొనసాగుతుంని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురుకులాల్లో కోడి గుడ్లు, బూట్లు, యూనిఫామ్ ఇలా ప్రతి దాంట్లో కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు అతికించే రేడి యం స్టిక్కర్లపైనా పెద్ద మొత్తంలో డబ్బు లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
గురువారం సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయ న మాట్లాడారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలు ప్రజల కండ్లకు కనబడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా అని ప్రశ్నించారు.
నిత్యం కాలువలు, కెనాల ద్వారా సాగు, తాగు నీరు ప్రజలకు అందుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు.






