7 March, 2026 | 10:58 PM

అంబేద్కర్ ఆశయాలు సాధించాలి: రామ్ సైదులు

07-03-2026 08:47 PM

- జై భీమ్ దీక్ష అందరికీ ఆదర్శం

గరిడేపల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనను ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలని తెలంగాణ మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ సైదులు అన్నారు.గరిడేపల్లి లో పొనుగోడు గ్రామానికి చెందిన నందిపాటి నరహరి జై భీమ్ దీక్ష చేపట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను,ఆలోచనలను అనుసరిస్తూ భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చాటుతూ జై భీమ్ దీక్ష చేపట్టడం ఎంతో గర్వకారణమని అన్నారు.

మండల కేంద్రమైన గరిడేపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టడం అందరికీ ఆదర్శం అన్నారు.మానవ హక్కుల కోసం అంబేద్కర్ అందరికీ సమన్యాయం కల్పించాలంటూ అనేక పోరాటాలు చేసిన విషయం ఆయన గుర్తు చేశారు.దళిత జాతి ఉద్ధరణ కోసం అంబేద్కర్ జననేని కృషి చేశారన్నారు.18 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా మహిళలు,కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు.మొదట దీక్ష చేపట్టిన నరహరికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి దీక్షామాలను అందించారు.

కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడమర్తి అంజి, తెలంగాణ సంస్కృతి సంఘం నాయకులు కోట వీరస్వామి, స్ఫూర్తి యువజన సంఘం అధ్యక్షులు అనంత కరుణాకర్ గౌడ్, జై భారత్ జిల్లా నాయకులు రణపంగు శ్రవణ్, వార్డు సభ్యులు నకరికంటి రమేష్, రామ్ మధు, నాయకులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కీసరి నాగయ్య, పాతకోటి లింగారెడ్డి, నందిపాటి రమేష్, మేధారి రాంబాబు, పిట్ట నరసయ్య, పందిరి చంటి తదితరులు పాల్గొన్నారు.